కర్నూలు – మూడు వ్యవసాయ చట్టాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని అదేవిధంగా మార్కెట్ యార్డ్ లను బలోపేతం చేయాలని మార్చి 26వ తారీకు న జరుగు భారత్ బంద్ కు సహకరించాలని కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి జయలక్ష్మి కి కిఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ కల్లూరు మండల కార్యదర్శి బస్తిపాడు మద్దిలేటి నాయకులు పెద్ద సుంకన్న తదితరులు కలిసి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడుతూ రైతు వ్యతిరేక మూడు చట్టాలను మరియు యు.వి విద్యుత్ సవరణ బిల్లు 2020 ను ఉపసంహరించుకోవాలని గత నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దులలో లక్షలాది మంది రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలిగే చట్టాలను రద్దు చేయకపోవడం క్షమించరాని విషయం అని అన్నారు ఇప్పటికే 250 మంది రైతులు అసువులు బాశారు అని రామకృష్ణ గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తుందని రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల తో కానీరైతు సంఘాలతో కానీ ఏమాత్రం సంప్రదించకుండా ఏకపక్షంగా చట్టాలను తీసుకొచ్చి రైతులకు సాయాన్ని దూరంచేసి తమ స్నేహితులైన బడా కార్పొరేట్ సంస్థలైన ఆ దానీ, అంబానీలకు కట్టబెట్టడానికి చర్యలు చేపట్టిందని అన్నారు దీనికి వ్యతిరేకంగా 500 సంఘాలు ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడి నవంబర్ 26 నుండి అనేక రూపాల్లో ఆందోళన చేయడం భారత్ బంద్ జనవరి జనవరి 26 ట్రాక్టర్ల ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడటం లేదు అందుకోసం మార్చి 26న మరొకసారి భారత్ బంద్ కు పిలుపు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం ఆపాలని 2020 విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని వంటి డిమాండ్లపై జరుగుతున్నటువంటి బందులో రైతులు కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఓర్వకల్లు విమానాశ్రయ ప్రారంభం26న జరగవలసిన కార్యక్రమం భారత్ బంద్ ను దృష్టిలో పెట్టుకొని 25వ తారీకు మార్చు కున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు గతంలో బందుకు మద్దతు తెలిపినట్లు ఇప్పుడు కూడా ప్రభుత్వం యొక్క మద్దతు సంపూర్ణంగా తెలపాలని రైతు సంఘం నాయకులు కోరారు
Advertisement
తాజా వార్తలు
Advertisement