ఆలూరు : గ్రామాలలోని సచివాలయానికి, ప్రజలకు సంధానకర్తలుగా సచివాలయ కన్వీనర్లు వ్యవహరిస్తారని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంప్ కార్యాలయం నందు దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్ చార్జి నారాయణస్వామి అధ్యక్షతన మాట్లాడుతూ తమ ప్రభుత్వం సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చినప్పటి నుండి గ్రామాలలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలూరు, ఆస్పరి, దేవనకొండ మండలాల నుండి ఎంపీపీలు, జెడ్పిటిసిలు, వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్ నెంబర్లు, ఎంపిటిసిలు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, వార్డ్ నెంబర్లు, వాలంటరీలు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement