Saturday, July 6, 2024

AP: చంద్ర‌బాబు, రేవంత్ కు రాయ‌ల‌సీమ సాగునీటి సాధన సమితి నేతల అభినంద‌న‌లు

ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు రాయలసీమ సాగునీటి సాధన సమితి నేతలు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన జరిగి పది సంవత్సరాలైనా అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్న నేపధ్యంలో, వీటి పరిష్కార దిశగా చొరవ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సానుకూలంగా స్పందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాయలసీమ సాగునీటి సాధన సమితి అద్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు బుధవారం నంద్యాలలోని కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్ర విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈనెల 6 వ తేదీన చర్చకు సిద్దమైన వేళ మంచి శుభ శూచకంగా సాగునీటి రంగంలో కీలకమైన అంశాలను పరిష్కారించాలని కోరుతూ చంద్రబాబు నాయుడుకి మెయిల్ ద్వారా లేఖను దశరథరామిరెడ్డి పంపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాలు రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతం అనీ, రాష్ట్ర విభజన అనంతరం కూడా విభజన అంశాల పరిష్కారంలో జాప్యం వలన నష్టపోతున్నది కూడా ఈ ప్రాంతాలేనని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల సాగునీటి రంగ అభివృద్ధికి రాజ్యాంగబద్ధమైన హక్కులను, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను దృష్టిలో ఉంచుకొని రెండు ప్రాంతాల అభివృద్ధికి మీరు కృషి చేయాలనీ, ఈ అంశాలపై ఈనెల ఆరో తారీఖున చేపడుతున్న చర్చల్లో పలు అంశాలకు ప్రాధాన్యతనిచ్చి, వాటి పరిష్కారానికి పాటు పడాలని లేఖలో చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement