నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో అన్యమత ప్రచారాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ నిబంధనల మేరకు అన్యమత ప్రచారంతో పాటు అన్ని మతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు, మొదలగుణీ ప్రదర్శించటం పూర్తిగా నిషేధించమన్నారు. అదేవిధంగా, దేవస్థానానికి సంబంధించిన వాహనాలపై అన్యమత సూక్తులు, చిహ్నాలు, బోధనలు, అన్యమతానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్‌లను అనుమతించబోమని పేర్కొంది.
అన్యమత ప్రచారానికి సహకరించిన దేవాదాయ ఉద్యోగులపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని… ఆలయ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో పనిచేసే ఉద్యోగులు కూడా నిబంధనలు పాటించాలన్నారు.