కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జాయింట్ సెక్రటరీగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఎంపికయ్యారు. ఆదివారం జరిగిన స్పెషల్ జనరల్ బాడీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారుల సంఘం కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించి కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సంయుక్త కార్యదర్శిగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఎంపికైనట్లు ప్రకటించారు.
- Advertisement -