Tuesday, November 26, 2024

AP: నంద్యాల సర్వజన వైద్యశాలను తనిఖీ చేసిన కలెక్టర్

నంద్యాల : నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పలు వార్డులను కలియతిరిగి రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలిస్తూ వైద్యాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ… వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో పాటు అత్యవసరమైన మందులను కూడా సరఫరా చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

యంసిహెచ్ బ్లాక్ లో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కరించాల్సిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హాస్పిటల్ లోని పలు వార్డులను తనిఖీ చేస్తూ సంబంధిత విభాగాల డాక్టర్లను అడిగి సమస్యలపై ఆరా తీశారు. తన స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్లకు సూచించారు. ఆక్సిజన్ సప్లై, ఓపీలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, కూర్చునే ప్రదేశాలు, కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రిలోని ఎంసిహెచ్ బ్లాకు, క్యాజువాలిటీ, ఔట్ పేషంట్, ఇన్ పేషెంట్, లేబర్ రూమ్, ఎస్ఎన్సియు తదితర విభాగాలను పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మారై, ఎక్సరే, సీటీ స్కాన్ లు రోజుకు ఎన్ని చేస్తారనే విషయంపై ఆరా తీసి రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రి తనిఖీలో భాగంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై పేషంట్స్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఆపరేషన్ కు అవసరమైన వైద్య పరికరాలను ఆస్పత్రి అభివృద్ధి నిధి నుండి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ మెడికల్ సూపరిండెంట్ డా.వరప్రసాద్ ను ఆదేశించారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాలన్నారు.

- Advertisement -

జిల్లా నలుమూలల నుండి డాక్టర్లపై ఎంతో నమ్మకంతో వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించి వారిని ఆదుకోవాలని డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వ సరోజన వైద్యశాలకు ప్రతిరోజు 1200 నుండి 1400 వరకు పేషెంట్లు రావడం జరుగుతుందని… తగినంత మేర సౌకర్యాలు లేవని సూపరిండెంట్ కలెక్టర్ కు నివేదించారు. వైద్యుల కొరత తక్కువగా ఉందని కార్డియాలజిస్ట్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల కొరత ఉందని కలెక్టర్ కు వివరించారు. ఈ తనిఖీలో డిసిహెచ్ఎస్ డా.జఫరుల్లా, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement