Saturday, September 21, 2024

KNL: చైల్డ్ హుడ్ క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తిస్తే నివారణ సాధ్యం.. కలెక్టర్ రంజిత్ బాషా

కర్నూలు, సెప్టెంబర్ 21 : చైల్డ్ హుడ్ క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తిస్తే వాటిని పూర్తి స్థాయిలో నివారించే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం విశ్వభారతి వైద్య కళాశాల, ఆసుపత్రి ఆధ్వర్యంలో చైల్డ్ హుడ్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ నుండి రాజ్ విహార్ వరకు ఏర్పాటు చేసిన మారథాన్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… క్యాన్సర్ అనేది పెద్ద వారిలోనే కాక చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుందని, అలాంటి సమయంలో భయాందోళనకు గురికాకుండా ప్రారంభ దశలో వాటిని గుర్తించి అందుకు తగిన చికిత్సను తీసుకోవడం ద్వారా చిన్నారులు త్వరితగతిన కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. ఏ జబ్బు అయినా ఒక వారం రోజుల ఇబ్బంది పెడుతుంటే అందుకు తగిన చికిత్స తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

చిన్న వయసులోనే క్యాన్సర్ తో పోరాడుతున్న వారికి తోడుగా ఉన్నామనే స్ఫూర్తి నివ్వడానికే విశ్వభారతి వైద్య కళాశాల, ఆసుపత్రి వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే క్యాన్సర్ సోకిన చిన్నారుల్లో చాలా రోజుల వరకు జ్వరం తగ్గకపోవడం, చర్మం పాలిపోయినట్లు ఉండడం, ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్త స్రావం జరగడం లాంటి లక్షణాలు ఉంటాయని అటువంటి వారు వెంటనే సంబంధిత వైద్యుడిని సంప్రదించి అందుకు తగిన చికిత్సను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వభారతి ఆసుపత్రి సిఈఓ కాంతరెడ్డి, డా.నిహారిక, డా.కాశీ భారతి, వైద్య సిబ్బంది, విశ్వభారతి కళాశాల విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement