Tuesday, November 19, 2024

రుద్రవరం లో దారుణం – రెండేళ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన తల్లి

కర్నూలు – నవ మాసాలు మోసి కని పెంచుకున్న ఓ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి కాటికి పంపింది ఓ తల్లి. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలోని రుద్రవరంలో వెలుగు చూసింది. మౌనిక తన రెండేళ్ల కుమారుడి గొంతు కోసి చంపింది. ఆ తర్వాత ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మౌనిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ దారుణ ఘటనకు పాల్పడడానికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement