నంద్యాల బ్యూరో, జనవరి 15 : కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో దర్శనార్థం కోసం వెళ్లే ఒక కార్ అదుపు తప్పి పల్టీలు కొట్టింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… బుధవారం రాజమండ్రి జంగారెడ్డిగూడెంకు చెందిన ఐదు మంది భక్తులు శ్రీశైలం వెళుతుండగా కారు అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న చెట్లలోకి వెళ్లి అక్కడ నిలిచిపోయింది.
శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి ఆలయ ప్రవేశ గెట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొందరికి తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -