Thursday, November 21, 2024

మ్యూజియంను సందర్శించిన మంత్రి బుగ్గన

కర్నూల్ కార్పొరేషన్ – కర్నూలు నగరంలోని ఆర్కియాలాజికల్ మ్యూజియంను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డికె బాలాజీలు సందర్శించారు.కర్నూలు నగర కేంద్రంలోని ఆర్కియాలాజికల్ మ్యూజియంలో ప్రాక్ చరిత్ర, మధ్య రాతియుగం, బృహత్ శిలా యుగం పనిముట్లు, గొడ్డళ్లు, వడిసెల రాయి, మట్టి బొమ్మలు, రోమన్, శాతవాహన, ఇక్ష్వాకుల నాణేలు, సింహ అవధాన జాతక పెన్సిల్ చిత్ర కల, బ్రిటిష్ – ఇండియా వెండి నాణాలు, కుతుబ్ సహరి వెండి నాణాలు, తాటి ఆకుల రాతి పత్ర, కటార్లు, కత్తులు, విల్లులు, అంబులములు, కంజర్లు, బంగారు పని తనం గల స్త్రీల డాలు, ఇత్తడి పిడకల కత్తి తదితర పనిముట్లను వారు పరిశీలించారు. ఆర్కియాలాజికల్ మ్యూజియంలో రాయలసీమ చరిత్ర, కొండపల్లి కోట డాక్యుమెంటరీ రూపంలో తయారు చేసి కంటికి కనిపించే విధంగా మ్యూజియంలో ప్రొజెక్టర్ ద్వారా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ లకు చూపించి వివరించారు.అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ కు ఆర్కియాలాజికల్ మ్యూజియం అధికారులు సన్మానించారు.కర్నూల్ ఆర్ డి ఓ వెంకటేష్, ఆర్కియాలాజికల్ మ్యూజియం టెక్నికల్ డిప్యూటీ డైరెక్టర్ మల్లికార్జున్, టెక్నికల్ అసిస్టెంట్ డైరెక్టర్ రజిత, కర్నూల్ అర్బన్ తహసిల్దార్ తిరుపతి సాయి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement