నందికొట్కూరు రూరల్, జనవరి 2 (ప్రభ న్యూస్) : రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డిని నందికొట్కూరు సబ్ జైలుకు మంగళవారం సాయంత్రం రిమాండ్ కు వచ్చారు. ఆత్మకూరు కోర్టులో హాజరు పరచగా.. ఆత్మకూరు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బొజ్జా దశరథరామిరెడ్డికి పది రోజులు పాటు జుడిషియల్ రిమాండ్ కు ఆదేశించారని ఆయనను 10 రోజుల పాటు నందికొట్కూరు సబ్ జైలులో రిమాండ్ లో ఉంటారన్నారు.
ఈ సందర్భంగా ఆయనను పరామర్శించేందుకు రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు నంద్యాల నుండి భారీగా తరలివచ్చారు. నందికొట్కూరు పట్టణానికి చెందిన అల్వాల బాలయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు, మహిళ సంఘం నాయకురాలు శోభారాణి, వారితో పాటు పలువురు ఆయనను పరామర్శించేందుకు భారీగా తరలివచ్చారు.