Friday, November 22, 2024

ఏపీలో పాలన గాడి తప్పింది.. 2024లో అధికారం మాదే: సోము

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని పాలన సక్రమంగా లేదని అన్నారు. బుధవారం కర్నూలులో బిజెపి పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. విద్యా రంగంలో పేపర్ లీకేజీ, ప్రభుత్వ టీచర్లు అరెస్ట్ చేయడం చూస్తుంటే ప్రభుత్వ పాలనలో పట్టు కోల్పోయిందన్నారు. మాజీ మంత్రి నారాయణను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వ టీచర్ అరెస్ట్ అయ్యారు,దీనికి ఎవరూ బాధ్యత తీసుకుంటారన్నారు.

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందన్నారు. కర్నూలు లో క్యాన్సర్ హాస్పిటల్ కోసం కేంద్రం 100 కోట్లు ఇస్తే ఇప్పటివరకు పూర్తి చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి 17వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపించారన్నారు. కేంద్రం ఇస్తున్న మందులు రాష్ట్రంలో దొరకడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యంగా కనబడుతుందని విమర్శించారు.

రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యంలో అవకతవలపై జరిగాయని, వాటిపై విచారణ లేదన్నారు. రాష్ట్రంలో ఫ్యామిలీ పార్టీకి బదులుగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలన్నారు. బీజేపీ మొదటి నుంచి ఫ్యామిలీ పాలిటిక్స్ కు వ్యతిరేకమని చెప్పారు. సంక్షేమంలో జగన్ కన్న మోడీ ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. 2024లో తామే అధికారంలోకి రావడం ఖాయమని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. జనసేనతోనే పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాయలసీమ డిక్లరేషన్ పై బీజేపీ కట్టుబడి ఉందని సోము తెలిపారు. రాయలసీమలో ప్రాజెక్టులపై ఉద్యమం చేస్తామన్నారు. ప్రభుత్వ ఖజానాలో రూ. 25 వేల కోట్లు ఉంటె రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చని చెప్పారు. తాము రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అయ్యేలా చూస్తామని సోము వీర్రాజు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement