కర్నూలు జిల్లా హొళగుంద గ్రామంలో హిందువులు పవిత్రంగా భావించే ఆంజనేయస్వామి జయంతి రోజున “వీరహనుమాన్ విజయ యాత్ర” నిర్వహించగా స్థానిక మసీదు నుండి దుండగులు ఒక్కసారి చెప్పులు, రాళ్ళు, ఆయుధాలతో దాడిచేశారని బీజేపీ, బజరంగ్ దళ్ నేతలు అన్నారు. అనుకోకుండా వచ్చిన ఈ హఠాత్పరిణామానికి బయపడిన చాలామంది దిక్కుతోచక అటూ ఇటూ పరిగెత్తి ప్రాణాలను కాపాడుకున్నారన్నారు. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డట్టు తెలిపారు. కాగా, బజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా హొళగుందలో హనుమజ్జయంతి సందర్భంగా దాడిచేసిన వారితో పాటు.. దాడికి గురై బాధపడుతున్న 40 మంది అమాయకులపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ఈ కేసులను ఎత్తివేయాలనీ డిమాండ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement