కర్నూలు ప్రతినిధి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటును సరైన రీతిలో వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మార్చి 13వ తేది (సోమవారం) ఉదయం ఉ.8.00 గం.ల నుండి సా.4.00 గం.ల వరకు ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం, ఓటు వేసేందుకు ఎలక్షన్ కమిషన్ సూచించిన ఏదైనా ఓటరు గుర్తింపు కార్డు తీసుకువెళ్ళాలని సూచించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం :
ఓటు వెయ్యండి ఇలా
మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ లో ఎలాంటి గుర్తులు ఉండవు.. కేవలం అభ్యర్థుల పేర్లు మరియు ఫోటోలు ఉంటాయి.
మీరు ఎంచుకునే అభ్యర్దుల ఎదురుగా 1, 2, 3 నెంబర్లు లేదా రోమన్ అంకెలు వేయాలి.
అభ్యర్ధుల పేరుకు ఎదురుగా ప్రాధాన్యతా సంఖ్యతో ఓటు వేయాలి.
ఒకటవ నెంబరు (1) తప్పని సరిగా వేయాలి. తరువాత వేయకపోయినా పరవాలేదన్నారు. ఒకటవ నంబరు (1) వేయకుండా 2,3 వేస్తే ఆ ఓటు చెల్లదు.
పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే పెన్ మాత్రమే వాడాలి.
వెళ్ళేటపుడు మీ గుర్తింపు కార్డును తీసుకొని వెళ్ళాలి…. ఎలక్షన్ కమిషన్ నిర్ణయించే 14 రకాల ప్రూఫ్స్.
వేయరాదు ఇలా…
మీ సొంత పెన్ వాడకూడదు.
ఒకే నెంబర్ ఇద్దరు అభ్యర్ధులకు ఇవ్వకూడదు.
బ్యాలెట్ పేపర్ లో ఎక్కువ పేర్లు ఉంటాయి.. ఆ పేర్ల లో మీకు నచ్చిన వారికి 1 వ నంబర్ వెయ్యాలి.
1వ ప్రాధాన్యతా సంఖ్య వేయకుండా మిగతా నంబర్స్ వేస్తే ఓటు చెల్లదు.
ఒకటి అని రాయకూడదు. ఇంగ్లీష్ లో కూడా వన్ అని రాయకూడదు
రెండు పేర్లకు మధ్యలో సంఖ్య వేస్తే చెల్లదన్నారు. ఒకే అంకె ఇద్దరికి వేసినా సదరు ఓటును పరిగణ లోకి తీసుకోవడం జరగదన్నారు.
అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటే, అందరికీ తప్పనిసరిగా ఓటు వేయాల్సిన అవసరం లేదు. ప్రాధాన్యతా క్రమంలో మీకు నచ్చిన కొందరికి మాత్రం ఓటు వేస్తే సరిపోతుంది.
అభ్యర్థి పేరుకు ఎదురుగా ఎటువంటి గుర్తులు పెట్టరాదు.
ఓటర్లు పై తెలిపిన సూచనలు పాటిస్తూ వారి అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.