Friday, November 22, 2024

విశ్వ భారతి హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత – పాత్రికేయులపై ఎంపీ అవినాష్ అనుచరుల దాడి

కర్నూల్ విశ్వభారతి హాస్పిటల్ ఎదురుగా ఆదివారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు వీరంగం చేశారు. పాత్రికేయులపై దాడికి దిగారు. కెమెరాలను ధ్వంసం చేశారు. విశ్వ భారతి హాస్పిటల్ వద్దకు వస్తే చంపేస్తామని బెదిరించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటన సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యరిత కర్నూల్ విశ్వభారతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి విధితమే. ఇదే క్రమంలో హాస్పిటల్లో ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డినీ ఈనెల 22న సిబిఐ విచారణకు హాజరుకావాలని నోటీస్ జారీ చేసిన సంగతి విధితమే.

అయితే తన తల్లి అనారోగ్య రిత్య విచారణకు హాజరు కాలనీ అవినాష్ రెడ్డి సిబిఐ పంపిన నోటీస్ కి రిప్లై లేక పంపారు. అయితే ఈ లేఖను సిబిఐ సమర్ధించలేదని, విశ్వ భారతి హాస్పిటల్ వద్ద వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు హైదరాబాదు నుంచి సిబిఐ బృందం కర్నూలుకు రానున్నట్లు సమాచారం అందింది. దీంతో ఆదివారం రాత్రి 8 గంటల నుంచి వివిధ పత్రికల కు సంబంధించిన పాత్రికేయులు, ఎలక్ట్రాన్ మీడియా ప్రతినిధులు విశ్వభారతి హాస్పిటల్ వద్ద మకాం వేశారు. అయితే రాత్రి 11 గంటల వరకు సిబిఐ బృందం గానీ, సభ్యులు కానీ ఎవరు అక్కడికి రాలేదు. కాగా అప్పుడికే పాత్రికేయులు ఆసుపత్రి వద్ద భారీ సంఖ్యలో ఉండడంతో అవినాష్ అనుచరులు వారిపై దాడికి తెగబడ్డారు. దొరికిన వారిని దొరికినట్లుగా చావబాదారు.

అక్కడ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ పాత్రికేయులపై దాడి జరుగుతున్న ప్రేక్షక పాత్ర వహించారు. అవినాష్ అనుచరులు జరిపిన దాడులలో ఆర్టీవికి చెందిన కెమెరామెన్ గాయాలయ్యాయి. కెమెరా ధ్వంసం అయింది. ఏది ఏమైనా విధి నిర్వహణలో భాగంగా ఆసుపత్రి ఆరుబయట ఉన్న పాత్రికేయులపై అవినాష్ అనుచరులు దాడికి పాల్పడడం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ సాయికుమార్ నాయుడు తీవ్రంగా ఖండించారు. మీడియాపై దాడి చేయడం అమానుషమన్నారు. ఈ విషయంలో పోలీసులు ప్రేక్ష పాత్ర వహించడంపై మండిపడ్డారు. దాడి చేసిన వారిని ఆసుపత్రి సిసి ఫుటేజ్ ల ద్వారా గుర్తించి వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement