శ్రీశైలంలో కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు
ఏడో రోజున పోటెత్తిన భక్త జనం
నేటి రాత్రి అమ్మవారికి గజవాహన సేవ
రాత్రికి శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం
శ్రీశైలం – ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఏడో రోజు ఉత్సవాల్లో భాగంగా నేడు సాయంత్రం కాళరాత్రి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇక, గజవాహనంపై ప్రత్యేక పూజలు అందుకోనున్నారు ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు..
ఇక గజవాహనంపై కొలువుదీరిన శ్రీస్వామి అమ్మవారికి ఆలయ అర్చకులు శాస్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం అమ్మవారిని పుష్పపల్లకిలో అధిరోహించి ప్రత్యేకపూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు.. ఈ సందర్భంగా శ్రీశైల క్షేత్రమంత శివనామస్మరణతో మారుమ్రోగింది. ఈ పూజ కైకర్యాలు, పుష్పపల్లకిసేవలో ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు..