కర్నూలు : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ మత్తు పదార్థాలు, డ్రగ్స్, ఎగుమతి కేంద్రంగా మార్చారని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశెట్టి నవీన్, తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు అబ్బాస్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గోపీనాధ్, ప్రభాకర యాదవ్, కార్యనిర్వాహక కార్యదర్శి మహేష్ నాయుడు, మోతీలాల్, సన గంగాధరగౌడ్ అన్నారు. తెలుగు యువత కార్యకర్తలతో కలిసి డ్రగ్స్, గంజాయి ఎగుమతులకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తే దున్నపోతుపై వర్షం పడినట్లుందని తెలియజేస్తూ టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడాతూ.. ఒకప్పుడు దేశం మొత్తానికి బియ్యం ఎగుమతి చేస్తూ అన్నపూర్ణగా పేరొందిన ఆంద్రప్రదేశ్.. నేడు జగన్ రెడ్డి పాలనలో గంజాయి, డ్రగ్స్ కి నిలయంగా మారిందన్నారు. 2021-22 ఏడాదిలో దేశంలో పట్టుబడిన డ్రగ్స్ పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన నివేధికలో మిగిలిన రాష్ట్రాల కంటే అత్యధికంగా కేంద్ర బలగాలు ఏపిలో స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసిందంటే రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ఎంతగా మారిపోయిందో తెలుస్తుందన్నారు. ఏపీలో 18,267 కేజీల డ్రగ్స్ సీఆర్.పి.ఎఫ్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. 1,057 కేజీల గంజాయి, 97 కొట్ల విలువైన 165 టన్నుల ఎర్ర చందనాన్ని కేంద్రభలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్, ఎంజిఎస్.ఆర్.ఈజిఎస్ పనులు వంటి వాటిలో ఏపి నెం. 1 స్థానంలో ఉంటే నేడు గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాలో నెం.1 స్థానం ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,49,761 కిలోల గంజాయి పట్టుబడితే అందులో 2,00588 కిలోలు మన రాష్ట్రంలోనే పట్టుబడినట్లు వెల్లడించారు. జగన్ రెడ్డి, వై.సి.పి. నేతలు తన అక్రమ సంపాదన కోసం రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, మాఫీయాలను పెంచిపోషిస్తూ జాతిని నిర్వీర్యం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి డ్రగ్స్, గంజాయి ఎగుతులను అరికట్టాలని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించి యువతను, మత్తుపదార్థాలకు దూరమయ్యేలా చూడాలని కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement