రాయలసీమ యూనివర్సిటీలో సీఎం జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు రాయలసీమ యూనివర్సిటీ రెక్టార్ ఆచార్య కృష్ణా రెడ్డి, రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీరాములు, అరెకటిక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కటిక గౌతమ్ హాజరయ్యారు.
రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థుల పెద్ద ఎత్తున హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీరాములు మాట్లాడుతూ కేజీ నుంచి పీజీ వరకు పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. సంక్షేమ పథకాలు ద్వారా పేద ప్రజలను ఆదుకుంటున్న మంచి మనస్సు ఉన్న వ్యక్తి సీఎం జగన్ అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 2మెడికల్ కాలేజీలు, సెంట్రల్ లా యూనివర్సిటీ ఇచ్చాడు అని అనేక విద్యా సంస్థలు ఇచ్చారన్నారు. నాడు టీడీపీ ప్రభుత్వం లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు కేవలం 20000 మాత్రమే ఇచ్చే వారని కానీ విద్యార్థుల బాధ ను గుర్తించి ప్రతి రూపాయి కూడా విద్యార్థుల తల్లితండ్రులు మీద భారం కాకుండా మొత్తం పీజులు చెల్లించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.