Sunday, June 30, 2024

AP: కర్నూలును అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా.. కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక అమలు
కర్నూలు బ్యూరో : ప్రజా ప్రతినిధులు, జిల్లా ప్రజల సహకారంతో కర్నూలు జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఉదయం 10.15 గంటలకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించి కలెక్టర్ ను ఆశీర్వదించారు..

బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ… ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కర్నూలు జిల్లా తనకు సొంత జిల్లా లాగా అని, తన స్వస్థలం నందికొట్కూరు నియోజకవర్గమ‌ని, తన విద్యాభ్యాసం కొంత వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే జరిగిందన్నారు. దాదాపు 20 సంవత్సరాల కిందట ఉద్యోగ రీత్యా కర్నూలు జిల్లాను విడిచి వెళ్లడం జరిగిందని, మరలా 20సంవత్సరాల తర్వాత జిల్లా కలెక్టర్ గా సొంత జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు…

- Advertisement -

ప్రజా ప్రతినిధులు, జిల్లా ప్రజల సహకారంతో జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అమలు చేస్తానని, జిల్లా ప్రజలందరికీ మేలు చేకూరే విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు..అనంతరం నూతన కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ మధుసూదన్ రావు, జిల్లా అధికారులు, తదితరులు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement