కర్నూలు – యూనిట్ 27 మద్రాస్ ఇండియన్ ఆర్మీ (ఫాజిలక్, పంజాబ్) లో విధులు నిర్వహిస్తూ అమరుడైన వీర జవాన్ నాయక్ దలాల్ షఫీ బౌతిక కాయానికి పూర్తి సైనికలాంచనాలతో బనగానపల్లిలో నిర్వహించారు.. జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప , నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, డోన్ డిఎస్పి నరసింహారెడ్డి, బనగానపల్లి సీఐ సురేష్ కుమార్ రెడ్డిలు వీర జవాన్ నాయక్ దలాల్ షఫీ పార్థివదేహం వద్ద పూల గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. .వీర జవాన్ నాయక్ దలాల్ షఫీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వీర జవాను అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.. కాగా పంజాబ్ నుంచి బనగానపల్లె మండల కేంద్రానికి అర్ధరాత్రి వీర జవాన్ నాయక్ దలాల్ షఫీ మృత దేహాన్ని ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement