Tuesday, November 26, 2024

కర్నూలు డీసీసీ పదవికి అహ్మద్ అలీఖాన్ రాజీనామా

వ్యక్తిగత కారణాల వల్ల కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు అహమ్మద్‌ ఆలీఖాన్ శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. అహమ్మద్‌ ఆలీఖాన్ గత సార్వత్రిక ఎన్నికల్లో గోవా, కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ర్టాల కాంగ్రెస్ ఎన్నికల ఇన్ ఛార్జిగా పనిచేశారు. 2014 సంవ‌త్స‌రంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. పోటీ చేసిన రెండు పర్యాయాలు రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల కంటే అత్యధిక ఓట్ల శాతం వచ్చి మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే అయిదు సంవత్సరాలు రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా పనిచేశారు. అధిష్టానం ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్నో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. తన మీద నమ్మకంతో ఇంత వరకూ తోడ్పాటునందించిన కాంగ్రెస్ అదిష్టానం పెద్దలకు, నాయకులకు, అలాగే ఇంతకాలం త‌నకు సహకరించిన జిల్లా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. త‌న రాజీనామా వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరినీ వ్యతిరేకించడం లేదని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ వస్తేనే దేశానికైనా, రాష్ట్రానికైనా మేలు జరుగుతుందని అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు నిరాధారమైనవని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త‌మ అనుచరులతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement