Tuesday, November 26, 2024

KNL: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు…

నగరపాలక కమిషనర్ రామలింగేశ్వర్ వెల్లడి
రోడ్ సేఫ్టీ సబ్ కమిటీ సమావేశం

కర్నూల్ కార్పొరేషన్ : నగరంలో ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక కమిషనర్ రామలింగేశ్వర్ అన్నారు. నగరపాలక కౌన్సిల్ హాలులో ట్రాఫిక్ సిఐ గౌతమి రెడ్డి, నగరపాలక పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కలిసి రోడ్డు సేఫ్టీ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. గతనెల 25న జిల్లా స్థాయి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించారు.

వాటి అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, కలిగే ఆటంకాలకు పరిష్కారాలపై చర్చించారు. అలాగే మెడికల్ కాలేజీ వద్ద మలుపు విస్తరణ, మద్దూర్ నగర్ నుండి సి.క్యాంపు వరకు రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ రూపకల్పన, చెక్‌పోస్ట్ నుండి నందికొట్కూరు రోడ్డుకు నగర సరిహద్దు వరకు రోడ్డు విస్తరణకు మార్కింగ్, ఫుట్ పాత్‌లపై తోపుడు బండ్ల తొలగింపు, వారి కోసం జోన్ల ఏర్పాటు, నిర్మాణాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా వాహనదారులు గుర్తించేలా బారియర్స్ ఏర్పాటు, 9 బస్‌షెటర్ల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మరో బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళిక తయారు అంశాలపైనా చర్చించి, వాటి అమలుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ పీ.వీ.రామలింగేశ్వర్ సంబంధింత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈలు షాకీర్, శేషసాయి, డీసీపీ సంధ్య, ఏసీపీ మంజులత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement