Tuesday, November 19, 2024

చట్ట విరుద్ద కార్యకలాపాలను నిర్వహించినా, ప్రోత్సహించినా చర్యలు : ఎస్పీ సిద్దార్థ్ కౌశల్

కర్నూల్ ప్రతినిధి : చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొన్ని సంస్థలను నిషేధిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల సంస్థలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటిఫికేషన్ విడుదల చేసిందని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంస్ధలు…
1) షాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI), దాని అనుబంధ సంస్థలు,
2) రిహాబ్ ఇండియా ఫౌండేషన్(RIF),
3) క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(CFI),
4) ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్(AIIC) ,
5) నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్( NCHRO),
6) నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్,
7) ఎంపవర్ ఇండియా ఫౌండేషన్,
8) రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (RIF) కేరళ,
పైన తెలిపిన సంస్థలను చట్టవిరుద్ధ కార్యకలాపాల సంస్థలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. (చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) అన్ లాఫుల్ యాక్టివిటీ, ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 27వ తేదిన ఇటువంటి సంస్ధలపై నిషేధం విధిస్తూ గెజిట్ విడుదల చేసిందన్నారు. ఇటువంటి కార్యకలాపాలు ఎవరైనా నిర్వహించినా, ప్రోత్సహించినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement