Saturday, November 23, 2024

మెగా డీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయాలని అర్ధనగ్న ప్రదర్శన

కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 25 వేల ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ, 5600 పోస్టులకు గ్రూప్-2 నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని కోరుతూ.. ఈరోజు డీవైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అధ్యక్షతన సోమవారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం ఖాళీలన్నింటినీ కలిపి ప్రతి సంవత్సరం డీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు డీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. డిసెంబర్ 22వ తేదీ పార్లమెంటులో కేంద్ర మంత్రి ధర్మేంద్ర డీవైఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు ఏఏ రహీం రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆంధ్రప్రదేశ్ లో 50667 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కానీ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు శాసన మండలిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని అడుగుతే కేవలం 774 పోస్టులే ఖాళీగా ఉన్నట్లు నిరుద్యోగులను మోసం చేసే విధంగా కుట్రపూరితమైన సమాధానం చెప్పారని తెలిపారు. గతంలో జాబ్ క్యాలెండర్ లో కానిస్టేబుల్ గ్రూప్ టు ఉద్యోగాల పైన కూడా ఇలాంటి ప్రకటనలే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇలాంటి అసంబద్ధ ప్రకటనలను మానేసి వాస్తవంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలకు తక్షణమే 25వేల పోస్టులతో డీఎస్సీని ప్రకటించాలని 5600 పోస్టులతో గ్రూప్ 2 ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏప్రిల్ 20వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు నిరుద్యోగులతో కలుపుకొని అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దిగవలసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష, నగర కార్యదర్శి హుస్సేన్ భాష జిల్లా స్పోర్ట్స్ కన్వీనర్ శంకర్, నాయకులు విక్రం మధు రాము శివ శిను రాజు తిమ్మప్ప ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప నగర అధ్యక్షులు అమర్ నాయకులు తేజ డీఎస్సీ గ్రూప్ 2 నిరుద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement