నంద్యాల బ్యూరో, సెప్టెంబర్ 4 (ప్రభ న్యూస్) : ఇటీవల కురిసిన వర్షాల కారణంగా విజయవాడలో వచ్చిన వరదలపై ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పందించిన తీరు అమోఘం. వరద కారణంగా విజయవాడలో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని, అక్కడి పరిస్థితులు, వరదలో చిక్కుకున్న వారిని చూసి చలించిపోతున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితులను చూసి అక్కడే ప్రజలకు సహాయం చేస్తున్నారని తెలిపారు. వేరే వేరే ప్రాంతాల అధికారులను మొత్తం అక్కడికి చేర్చి సహాయక చర్యలు చేపట్టారన్నారు. భూమా శోభా నాగిరెడ్డి ట్రస్ట్ తరఫున రూ.5లక్షలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
రేపు విజయవాడలోని 43వ వార్డులో ఒక ఏరియా ఎంచుకొని వారికి అన్నదాన కార్యక్రమం చేయబోతున్నామని, 43వ వార్డు ఎందుకు ఎంచుకుంటున్నామంటే ఆళ్లగడ్డ మున్సిపాలిటీ సిబ్బంది అంతా అక్కడే వరద బాధితుల కోసం కష్టపడుతున్నారు.. కనుక ఆ ఏరియా ఎంచుకోవడం జరిగిందని తెలిపారు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే తనతో కలిసి విజయవాడకు రావొచ్చని సూచించారు. ప్రజల కోసం ప్రముఖ సినీ యాక్టర్లు, ప్రముఖులు అందరూ సహాయం చేయడానికి భారీ విరాళాలు అందిస్తున్నారు..ఈ వరదకు ముఖ్య కారణం నీరు పారే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి బిల్డింగ్ లు కట్టేసి వ్యాపారాలు చేయడమేనన్నారు.
స్థలాలు ఆక్రమించడం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గం పరిధిలో ఎవరైనా ప్రభుత్వ భూములు, కాలువలు, కెనాళ్లు కబ్జా చేసి కట్టినా వారు ఉంటే ముందే హెచ్చరిస్తున్న.. మొత్తం కూల్చేయండి, లేదంటే అధికారులు వస్తారు… వారే మీపై యాక్షన్ తీసుకుంటారని హెచ్చరించారు. ఏ పార్టీ వారైనా, ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తి ఉండదని, సరైన ఆధారాలు లేకపోతే కచ్చితంగా కుల్చేస్తామని తెలపారు.