ఓర్వకల్, జూన్ 22( ప్రభ న్యూస్) – ఒర్వకల్లులో నీరు కలుషితం కావడంతో 40 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.. ఒక్కసారిగా వారికి వాంతులు, విరోచనాలు కావడంతో వెంటనే వారిని ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు.. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు.. ఇదిఇలాఉంటే హెల్త్ కమ్యూనిటీ సెంటర్ లో అడ్మిట్ అయిన వారిని పరామర్శించిన డి య్యం హెచ్ ఓ, ఆర్డిఓ, తాసిల్దార్, ఎంపీడీవో, డిపిఓ, డి ఎల్ పి ఓ తదిత అధికారులు పరామర్శించారు, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను కోరారు.
ఓర్వకల్ గ్రామంలోని వీధులను పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి రోగులను యోగ క్షేమంగా అడిగి తెలుసుకున్నారు. 108 వాహనం వైద్యశాలలో ఉంచుతామని అత్యవసరమైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మీదకి రావడం జరిగిందని గ్రామంలోని నీటిని నీటిని లాబరేటరీ కి తరలించినట్లు ఆర్డీవో తెలిపారు.