ఆలూరు మండలం అరికెర గ్రామం లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి అనంతరం గ్రామంలో నిర్వహించే రంగస్వామి రథోత్సవం నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. రంగ స్వామి రథోత్సవం లాగుతుండగా ప్రమాదవశాత్తు రథం గ్రామంలోని విద్యుత్ వైర్లకు తగు లగా తెగిపడ్డాయి. దీంతో రథోత్సవం వెంట వెళ్తున్న జనంపై విద్యుత్ వైర్లు పడడంతో గ్రామం చెందిన శివ, లక్ష్మణడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 5మంది కి గాయాలు కాగా వీరిని ఆలూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఈ వైద్యులు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూర్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
భాదితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశించారు.విధ్యుత్ అధికారులు నిర్లక్ష్యం వల్లే మృతి వాత పడ్డారని బాధితులు ఆరోపించారు.
మృతి చెందిన కుటుంబలకు ఒక్కోక కుటుంబానికి స్వతహగా లక్ష రూపాయలు చోప్పున మంత్రి గుమ్మనూర్ జయరామ్ ప్రకటించారు.
రంగస్వామి రథోత్సవంలో విషాదం – ఇద్దరు భక్తులు మృతి
Advertisement
తాజా వార్తలు
Advertisement