Friday, November 22, 2024

బీజేపీ ఒక శని గ్రహం – వైకాపా టీడీపీలు రాహుకేతువులు

వైకాపా టిడిపి జనసేన మజ్లిస్ పార్టీలు బిజెపి చేతిలో కీలుబొమ్మలు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి
నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు జె లక్ష్మి నరసింహ యాదవ్

నంద్యాల – రాష్ట్రానికి బిజెపి ఒక శనిగ్రహంలాగాన‌ వైకాపా టిడిపి పార్టీలు రాహుకేతువుల లాగా తయారయ్యాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి,నంద్యాల పార్లమెంటు జిల్లా డీసీసీ అధ్యక్షులు జె లక్ష్మీ నరసింహాయాదవ్ లు విమ‌ర్శించారు.. నంద్యాల మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధుల‌తో క‌ల‌సి ఈ ఇద్ద‌రు నేత‌లు ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ, పౌరసత్వ సవరణ చట్టం ముస్లిం మైనార్టీలకు లౌకిక వాదానికి రాజ్యాంగ మౌలిక సూత్రానికి వ్యతిరేకమని అలాంటిది బిల్లును బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టగా వైకాపా టిడిపి పార్టీలు మద్దతు తెలిపాయని గుర్తుచేశారు. కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో వైకాపా పాలనలో పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ సహజ వాయువు కందిపప్పు నిత్యావసరాల సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆర్టీసీ విద్యుత్ ఛార్జీలు కూడా పెరిగాయని ఏప్రిల్ ఒకటి నాటికి ఆస్తి పన్ను నీటి పన్ను డ్రైనేజీ పన్నులు పెరగబోతున్నాయని పన్నులు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచేందుకు కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో వైకాపా పార్టీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వైకాపా పాలనలో రాష్ట్రం రావణకాష్టం అయ్యిందని ఆటవిక పాలన కొనసాగుతోందని రౌడీ రాజ్యం అయ్యిందని ధ్వజమెత్తారు.
ఈ ప్ర‌చారంలో ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధ్రువ కుమార్రెడ్డి 7, 3 ,2, 35 వార్డుల అభ్యర్థులు దాసరి చింతలయ్య, వాసు, మైనార్టీ నాయకులు పఠాన్ హబీబ్ఖాన్ , ఫారూక్ , జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి భరత్ కుమార్ , మల్లేశ్వర్రెడ్డి , ఆర్టీసీ ప్రసాద్ ,అబ్దుల్ రెహమాన్ , జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు , అబ్దుల్ రజాక్ , యూత్ కాంగ్రెస్ విజయ్ యాదవ్, జనార్దన్ యాదవ్ త‌దిత‌రులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement