Tuesday, November 26, 2024

ఓర్వకల్లులో తొలి జెట్ – స్వాగ‌తం ప‌లికిన ప్ర‌జాప్ర‌తినిధులు

74 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి కర్నూలు చేరుకున్న తొలి జెట్ విమానం.
తొలి విమానం నడిపిన పైలట్ కర్నూల్ వాసి…

ఓర్వకల్లు,-కర్నూలు ఎయిర్ పోర్ట్ లో ఆదివారం చారిత్రాత్మక ఘట్టం.. చోటు చేసుకుంది.తొలి ప్యాసింజర్ ఫ్లైట్స్ (ఇండిగో) బెంగళూరు నుంచి 74 మంది ప్ర‌యాణీకుల‌తో ఉయ్యాలవాడ న‌ర్శింహ‌రెడ్డి విమానాశ్ర‌యంలో ల్యాండ్ అయింది. విమానాశ్రయం కు ఈ ఉదయం 10:10 గంటలకు వచ్చిన తొలి ప్యాసింజర్ ఫ్లైట్ కు రెండు అత్యాధునిక ఫైర్ ఇంజన్స్ వాటర్ క్యానన్స్ రాయల్ సెల్యూట్ తో ఘన స్వాగతం ప‌లికారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్..కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం..ఎంపీలు పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఏపీ ఎయిర్ పోర్ట్స్ డేవేలప్మెంట్ కార్పొరేషన్ ఎండి భరత్ రెడ్డి, ఎస్పీ డా.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, ఓర్వకల్ సర్పంచ్ తోట అనూష లు.
బెంగళూరు-కర్నూలు తొలి ప్యాసెంజర్ ఫ్లైట్ (ఇండిగో 6E7911) ను నడిపిన పైలట్ కర్నూలు వాసి వీరా కావ‌డం విశేషం..తొలి ప్యాసింజర్స్ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, బెంగళూరు నాగరబావి నివాసి రాంప్రసాద్ దంపతుల కూతురు సాయి ప్రతీక్ష లకు పూల మొక్కలను ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ , ఎయిర్ పోర్ట్ అధికారులు, ఇండిగో సంస్థ అధికారులు. అనంత‌రం కర్నూలు విమానాశ్రయం నుండి విశాఖపట్నం బయలు దేరిన తొలి ప్యాసింజర్ ఫ్లైట్ (ఇండిగో 6E 7912) కు జాతీయ జెండా ఊపి ప్రారంభించి, ప్యాసింజర్స్ కు స్వీట్స్ ప్యాకేట్స్ ను బహుకరించి ..హ్యాపీ జర్నీ చెప్పారు మంత్రులు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం..లోకల్ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, లోకల్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఏపీ ఎయిర్ పోర్ట్స్ డేవేలప్మెంట్ కార్పొరేషన్ ఎండి భరత్ రెడ్డి, ఎస్పీ డా.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు తదితరులు. కాగా, తొలి జ‌ర్ని ప్రారంభ‌కావ‌డంతో ఎయిర్ పోర్ట్ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది.
చరిత్రాత్మక ఘట్టం తొలి ప్యాసెంజర్ ఫ్లైట్స్ లో బెంగళూరు నుండి కర్నూలు ఎయిర్ పోర్ట్ కు రావడం..కర్నూలు ఎయిర్ పోర్ట్ నుండి విశాఖపట్నం బయలుదేరి వెళ్లడం..తమ జీవితాల్లో ఎన్నటికీ మారిచిపోలేని మధురానుభూతిని మిగిల్చింద‌ని,.. కర్నూలు జిల్లా వాసులు కర్నూలు ఎయిర్ పోర్ట్ నుండి విమాన ప్రయాణం కలను నిజం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి, ఫైనాన్స్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement