Friday, November 22, 2024

ఆంధ్రప్రభ ఎఫెక్ట్ – స్కానింగ్ సెంటర్లలో అధికారుల త‌నిఖీలు…

కర్నూల్ బ్యూరో, – జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కర్నూలు నగరంలోనీ పలు స్కానింగ్ సెంటర్లపై మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లాలో స్కానింగ్ సెంటర్ల నిలువు దోపిడీ పేరిట ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు ఈ దాడులు నిర్వహించడం గమనార్హం.ఈ దాడుల్లో పలు స్కానింగ్ కేంద్రాలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించి నోటీసులు జారీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామ గిడ్డయ్య నేతృత్వంలో వైద్య సిబ్బంది మొదట కర్నూలు గాయత్రి ఎస్టేట్ విజయ డయాగ్నస్టిక్ సెంటర్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ డయాగ్నొస్టిక్ సెంటర్ లో ధరల పట్టిక లేకపోవడాన్ని గుర్తించారు. పిసి పియన్ డిటి స్కానింగ్ మిషన్ లో పని చేయు వైద్యునికి బదులు మరో వైద్యుడు పని చేస్తున్నట్లు గా గుర్తించారు. పిసి పియన్ డిటి లో ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యునికి కోవిడ్ వచ్చినందువల్ల వేరే డాక్టర్ కు అపాయింట్ చేసుకున్నామని డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులు తెలియజేశారు. కానీ ఆ విషయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో విజయ డయాగ్నస్టిక్ సెంటర్ కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామ గిడ్డయ్య నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డెమో రఘురాం, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వీరి మాట ఎలా ఉన్నా గత నెలరోజులుగా జిల్లాలోని పలు స్కానింగ్ కేంద్రాలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఆంధ్రప్రభ విలువైన కథనం తర్వాత పరిగెత్తడం పై విమర్శలు తప్పలేదు. ఇన్ని రోజులు బ్యాక్ నెక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్ల వద్ద ఎలాంటి ధరల పట్టిక లేకుండా తమ ఇష్టం వచ్చిన రీతిలో దోపిడీ చేస్తూ వచ్చారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఇవన్నీ తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్లు కో వీడు రోగులను నిలువు దోపిడీ చేస్తున్న పట్టించుకోలేదు. ఇందుకు కారణం ఆయా కేంద్రాల నిర్వాహకులు ఇస్తున్న మామూలే అన్న ఆరోపణలు లేకపోలేదు. చివరకు సిటీ స్కానింగ్, వివిధ టెస్టులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ధరలు నిర్ణయించిన వాటిని కాదని నిర్వాహకులు ఇష్టానుసారంగా రోగులు, వారి బంధువుల వద్ద నుంచి వసూలు చేస్తూ వచ్చారు. చివరకు పత్రికల్లో కథనాలు వెలువడిన తర్వాత అధికారులు కదిలారంటే పరిస్థితిని గ్రహించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement