Friday, November 22, 2024

Kurnool YSRCP – కోడుమూరు ఎమ్మెల్యే కి వైసిపి జలక్… పార్లమెంటుకు గుమ్మనూరు

కర్నూల్ బ్యూరో .: .ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రాష్ట్రంలో వైసీపీ ఇన్చార్జిలో మార్పు కొనసాగుతోంది. ఆ పార్టీ నిర్వహిస్తున్న మార్పులు, చేర్పుల నేపథ్యంలో ఇప్పటికే పార్టీలో అసంతృప్తితో కొందరు నేతలు పార్టీ అధినేత పై కినుక వహించగా, కొందరైతే ఏకంగా పార్టీలు మారుతున్నారు. మరి కొందరు పార్టీలు మారుతామని అధిష్టానం హెచ్చరిస్తున్నారు. అయినా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ధోరణి ఏ మాత్రం మారలేదు.. కదా గెలిపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ తన సర్వే మెరకు పార్టీ అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సిట్టింగులకు మొండి చేయి చూపుతుండగా, మరికొందరు ఆశావావులకు టికెట్లు ఖరారు అవుతుండడం ఆ పార్టీలో మింగుడు పడడం లేదు. తాజాగా వైసీపీ మూడవ జాబితాను గురువారం రాత్రి ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొచ్చ సత్యనారాయణ తాడేపల్లి లో విడుదల చేశారు.

ఈ జాబితాలో ఊహించినట్టుగానే కర్నూలు జిల్లాలో మూడు స్థానాలకు మార్పులు చేర్పులు తప్పులేదు. ముఖ్యంగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు స్థానంలో జడ్పిటిసి అయిన విరుపాక్షికి కేటాయించారు.

మంత్రి గుమ్మనూరును కర్నూలు పార్లమెంట్ స్థానానికి ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం ప్రకటించింది. ఇక అందరూ ఊహించినట్లుగానే కోడుమూరు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ కు పార్టీ అధిష్టానం మొండి చేయి చూపింది. ఆ స్థానంలో వైసిపి అభ్యర్థిగా మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడైన డాక్టర్ ఆదిమూలపు సతీష్ కి ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. వైసీపీ ప్రకటించిన మూడు జాబితాలో ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఒక ఎంపీ కి మొండి చేయి చూపగా, మంత్రికి స్థానచలనం కలిగించింది. వైసిపి జలక్ ఇచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కు జలక్ ఇచ్చినట్లు అయింది.

కాగా మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సీటు మాత్రం పదిలం కావడం విశేషం. ఇలా ఉండగా మంత్రి గుమ్మనూరుకు ఆలూరు స్థానం కాకుండా, కర్నూలు పార్లమెంటు స్థానం కేటాయింపు పై మంత్రి గుమ్మనూరు జయరామ్ అనుచరులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రితో పాటు పార్టీ అధిష్టానాన్ని దుయ్యబట్టడం గమనారం. కాగా కోడుమూరు సమన్వయకర్తగా నియమితులైన ఆదిమూలపు సతీష్ అనుచరులు రాత్రి కర్నూల్ లో సంబరాలు చేసుకోవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement