కోడుమూరు, జనవరి 17(ఆంధ్రప్రభ) : కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. కోడుమూరు పట్టణానికి చెందిన బండ శ్రీనివాసులు, సోమశేఖర్, ఐడియా శ్రీనులు ప్రమాదంలో మరణించారు.
జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ టైరు పేలిపోవడంతో అదుపుతప్పి పక్క నుంచి వెళ్తున్న కారుపైకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికీ తీవ్రగాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు కోడుమూరు వాసులు సోమశేఖర్, శ్రీనివాస్, బండ శ్రీనుగా గుర్తించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు నుండి వీరు పట్టుచీరల వ్యాపారం ముగించుకొని తిరిగి కోడుమూరుకు వస్తుండగా ఈఘటన జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.