Tuesday, November 26, 2024

Kurnool – నిజాయితీకి , నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం ఆర్య వైశ్యులు – టీజీ వెంకటేష్

కర్నూలు..వ్యాపార రంగంలో నిజాయితీకి, నిబద్ధతకు ఆర్యవైశ్యులు నిదర్శనంగా నిలుస్తారని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఆదివారం ఆదోని పట్టణంలో జరిగిన కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు కష్టపడి వ్యాపారాలు చేస్తూ, వీలైనంతవరకు దానధర్మాలు చేసేవారేనని అన్నారు. ఆర్యవైశ్యులు ఇప్పుడు ప్రతి రంగంలోనూ తమదైన శైలిలో రాణిస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని టీజీ వెంకటేష్ అన్నారు.

గతంలో ఉన్నటువంటి కమిటీ అక్రమంగా మహాసభ పగ్గాలు చేజిక్కించుకుని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని టీజీ అన్నారు. మహాసభ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో విలువైన కార్యక్రమాలు చేస్తుంటే, గత కమిటీ మాత్రం వాటన్నిటిని నీరుగార్చిందని అన్నారు. రోశయ్య లాంటి పెద్దల కృషితో మహా వృక్షంలా ఏర్పడినటువంటి ఆర్యవైశ్య మహాసభ పక్కదారి పడుతుంటే చూడలేక గత కమిటీ వారిని తొలగించి మహాసభకు నూతన కమిటీని ఎన్నుకునేలా చేసామని టీజీ వెంకటేష్ తెలిపారు. కొత్తగా ఎన్నుకోబడిన కమిటీ రాబోయే తరాల వారికి ఆదర్శంగా ఉంటూ, మరింత ఉన్నతమైన సేవా కార్యక్రమాలు చేపట్టాలని టీజీ వెంకటేష్ కోరారు. .

ఆర్యవైశ్య మహాసభ నాయకులు చేపట్టబోయే ఎటువంటి కార్యక్రమానికి అయినా తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని టీజీ తెలిపారు. అలాగే తాను పుట్టిన ఆదోని ప్రాంతంలో ఐదు కోట్ల రూపాయల్లో వాసవి మాత ఆలయం, ఆర్యవైశ్య హాస్టల్ ఏర్పాటు చేయాలని తలచినట్లు తెలిపారు. అందుకు త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభిస్తామని టీజీ వెంకటేష్ ప్రకటించారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్న ఆర్యవైశ్యులు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు…

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్న రామ సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహాసభ సీనియర్ నాయకులు విట్ట రమేష్, విటల్ శెట్టి, ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు మిరియాల బద్రీనాథ్, పనిభూషణ్ , వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.టేష్ అన్నారు. ఈరోజు ఆదోని పట్టణంలో జరిగిన కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు కష్టపడి వ్యాపారాలు చేస్తూ, వీలైనంతవరకు దానధర్మాలు చేసేవారేనని అన్నారు. ఆర్యవైశ్యులు ఇప్పుడు ప్రతి రంగంలోనూ తమదైన శైలిలో రాణిస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని టీజీ వెంకటేష్ అన్నారు. గతంలో ఉన్నటువంటి కమిటీ అక్రమంగా మహాసభ పగ్గాలు చేజిక్కించుకుని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని టీజీ అన్నారు. మహాసభ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో విలువైన కార్యక్రమాలు చేస్తుంటే, గత కమిటీ మాత్రం వాటన్నిటిని నీరుగార్చిందని అన్నారు. రోశయ్య లాంటి పెద్దల కృషితో మహా వృక్షంలా ఏర్పడినటువంటి ఆర్యవైశ్య మహాసభ పక్కదారి పడుతుంటే చూడలేక గత కమిటీ వారిని తొలగించి మహాసభకు నూతన కమిటీని ఎన్నుకునేలా చేసామని టీజీ వెంకటేష్ తెలిపారు. కొత్తగా ఎన్నుకోబడిన కమిటీ రాబోయే తరాల వారికి ఆదర్శంగా ఉంటూ, మరింత ఉన్నతమైన సేవా కార్యక్రమాలు చేపట్టాలని టీజీ వెంకటేష్ కోరారు. ఆర్యవైశ్య మహాసభ నాయకులు చేపట్టబోయే ఎటువంటి కార్యక్రమానికి అయినా తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని టీజీ తెలిపారు. అలాగే తాను పుట్టిన ఆదోని ప్రాంతంలో ఐదు కోట్ల రూపాయల్లో వాసవి మాత ఆలయం, ఆర్యవైశ్య హాస్టల్ ఏర్పాటు చేయాలని తలచినట్లు తెలిపారు. అందుకు త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభిస్తామని టీజీ వెంకటేష్ ప్రకటించారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్న ఆర్యవైశ్యులు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్న రామ సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహాసభ సీనియర్ నాయకులు విట్ట రమేష్, విటల్ శెట్టి, ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు మిరియాల బద్రీనాథ్, పనిభూషణ్ , వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement