Saturday, November 23, 2024

ఉక్రెయిన్ లో బిక్కుబిక్కుమంటున్న కర్నూలు విద్యార్థి.. తిండి లేక ఇబ్బంది

రష్యా,ఉక్రెయిన్‌ యుద్ధ భయాలతో అక్కడి తెలుగు ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అరుణ్ కుమార్ ఉక్రెయిన్‌లో మెడిసిన్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి అరుణ్ కుమార్ తో పాటు అక్కడి తెలుగు విద్యార్థులు తమను స్వదేశానికి తీసుకెళ్లాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. క్షణక్షణం తాము ప్రాణభయంతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. తినడానికి, తాగడానికి కూడా తమకు ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు.

అరుణ్ కుమార్ తల్లిదండ్రులు లక్ష్మన్న, లలిత ఆదోని పట్టణంలోని మార్కెండేయ గుడి దగ్గర సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్,రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తమ కుమారుడిని సురక్షితంగా ఆదోని తీసుకురావలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వాళ్ళని కాపాడలని ప్రాధేయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement