Saturday, November 23, 2024

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డే ఏ1: టీడీపీ సంచలన ఆరోపణ

మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యలో యంపి వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కరరెడ్డిలే ప్రధాన సూత్ర,పాత్ర దారులని కర్నూలు జిల్లా టిడిపి నేతలు ఆరోపించారు. అన్ని ఆధారాలు చూపుతున్నా.. సీఎం జగన్ నేరస్తులను కాపాడేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ అవినాష్ రెడ్డిపై సిబిఐ విచారణ జరుగకుండా అడ్డుపడుతున్నట్లు జగన్ సోదరి సునితారెడ్డి లోక్ సభ స్పీకర్ కి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వివేకానందరెడ్డి హత్యను గొడ్డలివేటును గుండెపోటుగా చిత్రీకరించిన అంశాన్ని సిబిఐ తన చార్జీసీటులో ప్రస్తావించిందని తెలిపారు. సీబీఐ విచారణలో తమ పేర్లు చెప్పకుండా ఉంటే 20 ఎకరాల భూమి కావల్సినంత డబ్బు ఇస్తామని అవినాష్ రెడ్డి ఆఫర్ చేశాడని ఆరోపించారు. దస్తగిరికీ , గంగాదర్రెడ్డిపై నేరం వేసుకుంటే 10 కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. రూ .40 కోట్ల సుపారితో హత్య చేయించే స్థోమత ఎవరికుంటుందని ప్రశ్నించారు. మొదట సిబిఐ వచారణను కోరిన జగన్ రెడ్డి హైకోర్టు ద్వారా తిరిగి కేసును ఉపసంహరించుకున్నారని అన్నారు. జగన్ ఎవరినైనా హత్య చేయించాలంటే ముందు ఆ నెపం ప్రతిపక్షంపై వేసి తన పని తాను పూర్తి చేయిస్తారని ఆరోపించారు. వివేక హత్యను కూడా టీడీపీ అధినేతపై వేసే కుట్రచేశారని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డే ఏ1 ముద్దాయి అని వ్యాఖ్యానించారు. సొంత కటుంబ సభ్యుల ప్రాణాలకే రక్షణలేని జగన్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుందని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement