Monday, December 9, 2024

Kurnool – పుట్టగొడుగుల ఫ్యాక్టరీలో విష‌వాయువులు … న‌లుగురు కార్మికుల‌కు అస్వ‌స్థ‌త

క‌ర్నూలు – కర్నూలు పుట్టగొడుగుల ఫ్యాక్టరీలో డ్రైనేజీ శుభ్రం చేస్తుండగా విష‌వాయువులు వెలువ‌డ‌టంతో న‌లుగురు కార్మికులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.. . కర్నూలు ఓర్వకల్ మండలం కాల్వబుగ్గ వద్ద పుట్టగొడుగుల ఫ్యాక్టరీ లో నేడు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. విషవాయువుతో కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంట‌నే వారిని చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు..


కాగా, ఫ్యాక్టరీ వ్యర్థాలతో అయిదు అడుగుల మేర డ్రైనేజీ నిండిపోవడంతో కార్మికులు దీనిని శుభ్రం చేసేందుకు ఇందులో దిగారు..
యంత్రాలతో కాకుండా కార్మికులతో శుభ్రం చేయించడంతో భరించలేని దుర్గంధానికి అపస్మారక స్థితిలోకి వెళ్లారు కార్మికులు. . ఇక వారిని కర్నూలు జిజిహెచ్ కు తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటన పై మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement