కర్నూల్ నగరపాలక సంస్థ పాలకవర్గం ఏర్పడి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా శుక్రవారం కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయంలో పాలకవర్గం సభ్యులతో కలిసి మేయర్ బి వై రామయ్య, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, కార్పొరేటర్లు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ బి వై రామయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో కర్నూలు నగరాన్ని నందనవనంగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. నగరంలో మంచినీటి శాశ్వత పరిష్కారం కోసం రూ. 600 కోట్లతో బృహత్ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. హంద్రీనీవా, అలగనూరు రిజర్వాయర్ నుంచి నీరు అందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో వీటికి ఆమోదం లభించనుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని ప్రధాన రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement