Friday, November 22, 2024

kurnool – ఆర్పీలపై అధికారుల వేధింపులు ఆపాలి

కర్నూలు – మెప్మా సంస్థలో పనిచేస్తున్నఆర్పీలపై అధికారుల వేధింపులు ఆపాలని సి.ఐ.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అంజిబాబు కోరారు స్థానిక కార్మిక కర్షక భవన్ నందు ఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షురాలు రుద్రమ్మ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అంజిబాబు మాట్లాడుతూ ఆర్పీల పైన అధికారులు వేధింపులు పెరిగాయని అన్నారు కొత్తగా ఏర్పాటు చేసిన మాల్స్ లలో ఒక్కొక్క అర్పి 1,50,000 రూపాయలు విలువచేసే వస్తువులు కొనుగోలు చేసే విధంగా టార్గెట్లు నిర్ణయించడం సరైంది కాదని అన్నారు.

అలాగే ఏదైనా అధికార పార్టీ సభలు జరిగితే ఒక్కొక్క ఆర్పి 50 మందిని సభకు తరలించే విధంగా టార్గెట్లను విధించడం సరైన పద్ధతి కాదని అన్నారు ప్రజలను సమీకరించడానికి ఆటో చార్జీలు కూడా ఆర్పీలే భరించవలసి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వేధింపులను అధికారులు మానుకోవాలని కోరారు . ఈ సమావేశంలో ఆర్పీల సంఘం నాయకులు షబానా సుజాత పర్వీన్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement