కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కే. బాలాజీ.. బాలాజీ (తిరుపతి) జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయన నివాసంలో కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా బి.వై. రామయ్య మాట్లాడుతూ కరోనా క్లిష్టమైన సమయంలో కర్నూలుకు బాలాజీ కమిషనర్ గా వచ్చారని అన్నారు. ఆ సమయంలో ఎన్నో సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని చెప్పారు. కర్నూలు నగరంలో తనదైన మార్క్ తో పుష్కరాల నిర్వహణ, నగర పాలక సంస్థ ఎన్నికలు, వీనస్ నగర్ కాలనీలో అతిపెద్ద జాతీయ ఏర్పాటు, బిన్ ఫ్రీ సిటిగా కర్నూలు, స్వచ్చతలో 197 ర్యాంకు నుంచి 70 ర్యాంకు సాధన, అద్భుతంగా నగర సుందరీకరణ, కొండారెడ్డి బురుజు వద్ద అక్రమణల షాపుల తొలగింపు, దశాబ్దాలుగా వేలంపాటకు నోచుకోని మున్సిపల్ షాపులకు వేలంపాట ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. బాలాజీ మళ్ళీ కలెక్టర్ గా కర్నూలు జిల్లాగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement