ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంపై మంత్రి ఆదిమూలపు సురేశ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేసిందని చెప్పారు. ఈ విషయాన్ని తాను ఇప్పుడే చెప్పకూడదనుకున్నా.. కానీ, కర్నూలుకు జ్యుడిషియల్ కేపిటల్ వచ్చేసింది అని అన్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పుడే ప్రకటించకూడదని కూడా మంత్రి సురేశ్ చెప్పడం గమనార్హం. అయితే.. ఆగస్టు 15వ తేదీ తర్వాత ఏపీలో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయన్నారు.
కాగా, ఏపీలో ఏం జరగబోతోందో మీరే చూస్తారని కూడా మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం అమరావతి చుట్టూ అభివృద్ధి అని గ్రాఫిక్స్ చూపిస్తూ ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు. ఓ సామాజిక వర్గానికి మాత్రమే అభివృద్ధి జరిగేలా పక్కాగా ప్లాన్ చేశారని పేర్కొన్నారు. అందుకే వికేంద్రీకరణ మంత్రంతో అభివృద్దితో పాటు పాలన కూడా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.