Thursday, September 26, 2024

8 నియోజకవర్గాలతో కర్నూలు జిల్లా.. పాణ్యం కూడా ఇందులోకే..

కర్నూలు, ప్రభన్యూస్ : కొత్త జిల్లాల ఏర్పాటు-కు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రతిపాదిత జిల్లాల ఏర్పాటు- అంశము మంత్రులకు ఆన్‌లైన్‌లోనే పంపి వారి ఆమోదం తీసుకుంది.కొత్త జిల్లాలు, వాటి పరిధిలో మండల కేంద్రాలు, రెవిన్యూ డివిజన్లు,జిల్లా కేంద్రాలను గుర్తిస్తూ ఈ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వచ్చే ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు-కుంది. కొత్త జిల్లాలపై ఆన్‌లైన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లా ప్రతిపాదనను మంత్రివర్గం ముందుంచారు. దానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశానికి ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రక్రియ గురించి వారికి వివరించి, అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు.మొత్తంగా ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కర్నూలు జిల్లా రెండుగా విడివడ నుంది , ప్రస్తుతం కర్నూలు జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలుండగా, వీటిలో నంద్యాల లోక్‌సభ స్థానంను నంద్యాల జిల్లాగా చేసేందుకు ప్రతిపాదించారు.

అంతేకాదు నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు శానససభ స్థానాలూ అంటే కచ్చితంగా దాని పరిధిలోకే రావాలన్న నిబంధనను ప్రస్తుత నోటిఫికేషన్లో పరిగణలోకి తీసుకోలేదు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పాణ్యం నియోజకవర్గం ను, కొత్తగా ఏర్పడనున్న కర్నూల్‌ జిల్లా పరిధిలో కలిపేశారు. ఇందుకు కారణం పాణ్యం నియోజకవర్గం జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉండటమే, ముఖ్యంగా పాలు నియోజకవర్గం పరిధిలోని కల్లూరులో దాదాపు లక్షల ఓటర్లున్నారు కల్లూరు కర్నూలు నగరానికి అతి దగ్గరగా ఉండడం కూడా ఒక కారణం. పైగా కల్లూరు, ఓర్వకల్లు ను కర్నూల్‌ జిల్లాలోనే విలీనం చేయాలని మొదటి నుంచి అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లా పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ మార్పులు, చేర్పుల వల్ల కర్నూలు జిల్లా పరిధిలోకి 8 శాసనసభ నియోజకవర్గాలు వస్తుంటే, నంద్యాల జిల్లా పరిధిలోకి ఆరు శాసనసభ స్థానాలతోనే ఏర్పాటవుతున్నట్లు- నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రతిపాదిత నంద్యాల జిల్లా – కర్నూలులో నూతన జిల్లాగా అవతరించినున్న నంద్యాల ఆరు నియోజకవర్గాలతో ప్రతిపాదన చేయగా వాటి కిం 1. నందికొట్కూర్‌. 2. శ్రీశైలం3. నంద్యాల,4. ఆళ్లగడ్డ,5. బనగానపల్లి 6.డోన్‌ నియోజకవర్గాలు రానున్నాయి. ఈ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 27 మండలాలతో నంద్యాల జిల్లా విస్తరించేలా ప్రతిపాదించారు.

ఇందులో నంద్యాల పరిధిలో 9 మండలాలు, డోన్‌ పరిధిలో 8, ఆత్మకూరు పరిధిలో 10, మొత్తం 27 మండలాలతో నంద్యాల జిల్లాగా అవతరించనుంది.వీటిలో శ్రీశైలం, కొత్తపల్లి, ఆత్మకూరు, పగిడ్యాల, నందికొట్కూరు, జూపాడు బంగ్లా, మిడుతూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, నంద్యాల, గోస్పాడు, సిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి, కోయిలకుంట్ల, సంజామల, దొర్నిపాడు, బనగానపల్లె, డోన్‌ ,ప్యాపిలి, బేతంచర్ల, ఆవుకు, కొలిమిగుండ్ల మండలాలు రానున్నాయి. వీటి పరిధిలో మొత్తం 9.155 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంతో నంద్యాల జిల్లా అవతరించ నుండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం 16.87 లక్షల జనాభా తో కొత్త జిల్లాకు ప్రతిపాదించారు. నంద్యాల జిల్లా పరిధిలో రెవెన్యూ డివిజన్ల గా నంద్యాల,డోన్‌, ఆత్మకూరు లను పరిగణించ నున్నారు.కర్నూలు జిల్లా :ఇక కర్నూలు జిల్లా ప్రతిపాదన అంశంలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు పరిగణలోకి తీసుకున్నారు.

వీటిలో 1.పత్తికొండ, 2. ఆలూరు 3. ఆదోని ,4.మంత్రాలయం,5. పాణ్యం, 6. కర్నూలు,7. కోడుమూరు, 8. ఎమ్మిగనూరులు ఉన్నాయి.ఫై నియోజకవర్గాల్లోని గడివేముల,పాణ్యం, ఓర్వకల్లు, కర్నూలు, వెల్దుర్తి, కోడుమూరు, గూడూరు, కల్లూరు, క్రిష్ణగిరి, సి.బెళగల్‌ ,గోనెగండ్ల దేవనకొండ, తుగ్గలి ,పత్తికొండ, మద్దికేర, చిప్పగిరి, ఎమ్మిగనూరు,కోసిగి, పెద్దకడబూరు, ఆస్పరి ,క్రిష్ణగిరి, హల్వ్‌ హరి, కౌతాళం, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, మొత్తం 28 మండలాలతో 8507 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 23.66 లక్షల జనాభాతో కర్నూలు జిల్లా ఏర్పాటు- కానుంది. కర్నూల్‌ జిల్లా పరిధిలో విని డివిజన్లుగా కర్నూలు, ఆదోనిలను గుర్తించారు. మొత్తంగా నూతన జిల్లాల అవతరణతో ఇప్పటివరకు కర్నూలు, నంద్యాల ,ఆదోని రెవెన్యూ డివిజన్లుగా ఉండగా, ఇకపై ఆత్మకూరు,డోన్‌ కొత్త రెవెన్యూ డివిజన్లు ప్రభుత్వం ప్రతిపాదించడం గమనార్హం.రాష్ట్రంలోనే అతి ఎక్కువ జనాభా జిల్లాగా కర్నూల్‌రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు- చేస్తుండటంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్వరూపం పూర్తిగా మారిపోనుంది.

ప్రభుత్వం ఏర్పాటు- చేయనున్న కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాల్లో జనాభా పరంగా 23.66 లక్షల జనాభాతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో నిలవనుంది. ఈ జాబితాలో పాడేరు కేంద్రంగా ఏర్పాటు- కానున్న అల్లూరి సీతారామరాజు జిల్లా 9.54 లక్షల జనాభాతో చివరి స్థానంలో నిలవనుంది.జిల్లాలు-జనాభా: శ్రీకాకుళం జిల్లా 21.91 లక్షలు, విజయనగరం జిల్లా 18.84 లక్షలు, మన్యం జిల్లా 9.72 లక్షలు, అల్లూరి సీతారామరాజు జిల్లా 9.54 లక్షలు, విశాఖ జిల్లా 18.13 లక్షలు, అనకాపల్లి జిల్లా 18.73 లక్షలు, తూర్పుగోదావరి జిల్లా 19.37 లక్షలు, కోనసీమ జిల్లా 18.73 లక్షలు, రాజమండ్రి జిల్లా 19.03 లక్షలు, నరసాపురం జిల్లా 17.8 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా 20.03 లక్షలు, కృష్ణా జిల్లా 17.35 లక్షలు, ఎన్టీఆర్‌ జిల్లా 22.19 లక్షలు, గుంటూరు జిల్లా 20.91 లక్షలు, బాపట్ల జిల్లా 15.87 లక్షలు, పల్నాడు జిల్లా 20.42 లక్షలు, ప్రకాశం జిల్లా 22.88 లక్షలు, నెల్లూరు 23.37 లక్షలు, కర్నూలు 23.66 లక్షలు, నంద్యాల జిల్లా 16.87 లక్షలు, అనంతపురం 23.59 లక్షలు, సత్యసాయి జిల్లా 17.22 లక్షలు,, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా 19.9 లక్షలు, అన్నమయ్య జిల్లా 17.68 లక్షలు, చిత్తూరు జిల్లా 19.85 లక్షలు, శ్రీ బాలాజీ జిల్లా 22.18 లక్షల జనాభా ఉండటం విశేషం.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement