Wednesday, November 20, 2024

Kurnool – దేవనకొండలో ప్రబలిన అతిసార – కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పెరుగుతున్న కేసులు

దేవనకొండ.09.ప్రభ న్యూస్ మండల కేంద్రమైన దేవనకొండలో అతిసార ప్రబలడంతో శనివారం ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఇద్దరు వ్యక్తులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. గ్రామంలోని పాత మార్కెట్ కాలనీకి చెందిన బాల రంగడు,భూలక్ష్మి ,మస్తాన్ వలి,మహబూబ్, నబి రసూల్, ప్రవీణ్, నరసప్ప, శుషాంత్ లు వాంతులు,విరోచనాలకు గురి కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తము స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో బాల రంగడు, భూలక్ష్మి లను మెరుగైన వైద్య చికిత్స కోసం అంబులెన్స్ లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆ కాలనీలో కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న మంచినీరు కలుషితం కావడంతో అతి సార ప్రబలినట్లు ఆ కాలనీ వాసులు తెలిపారు. ప్రబలిన అతి సార గురించి ప్రాథమిక వైద్య అధికారి విజయ భాస్కర్ ను ప్రశ్నించగా వ్యాధి ప్రబలిన వారికి వైద్య చికిత్సలు అందించామని ఇద్దరి వ్యక్తులను కర్నూల్ ఆసుపత్రికి రెఫర్ చేశామన్నారు.

పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి ,- .కాలనీ వాసులు

పాత మార్కెట్ కాలనీలో మంచినీటి పైప్ లైన్ లీకేజీ ఉందని పలు మార్లు పంచాయతీ కార్యదర్శి కి చెప్పమని కానీ పటించుకొలేదన్నరు.అందు వల్ల నీరు కలుషితం అయిందని తెలిపారు.నీరు కలిషితం కావడం వల్లే అతసార ప్రభలి కాలనీ వాసులు కు వాంతులు విరోచనాలు కావడం జరిగిందన్నారు.కావున సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆ కాలనీవాసులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement