Friday, November 22, 2024

Kurnool – అధికార కార్పొరేటర్ల ప్రతి పక్షపాత్ర – మేయర్‌ ను, ఎంఎల్‌ఏలను, అధికారులను నిండు సభలో నిలదీత

కర్నూలు, నవంబర్‌ 25,( ప్రభన్యూస్‌ బ్యూరో)అధికార పక్ష కార్పొరేటర్లు ప్రతిపక్షపాత్ర పోషించారు. అధికార పార్టీ నేతలను, అధికారులను కార్పోరేటర్లు కడిగివేసిన ఉదంతం శనివారం కర్నూలు కార్పోరేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. కర్నూలు కార్పోరేషన్‌ మున్పిపల్‌ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశము నిర్వహించారు. ఈ సందర్బంగా నగరంలో చేపట్టిన అభివద్ది పనులు చేపట్టిన విషయంలో ధన్యవాదాలు తెలిపే విషయంలోనే అధికార వైసీపీ పార్టీకి చెందిన కార్పొరేటర్లు వ్యతిరేకించారు. తమ డివిజన్‌ పరిధిలో ఎలాంటి అభివద్ది పనులు చేపట్టకపోయిన అభివద్ది జరిగిందని ధన్యవాదాలు ఎలా చెబుతానని, అధికారపార్టీ వైసీపీ కార్పొరేటర్‌ మేయర్‌ ను నిలదీశారు. అభివద్ది జరిగిన ప్రాంత కార్పొరేటర్లు ధన్యవాదాలు చెప్పుకొవచ్చనని అందరు ముకుమ్మడిగా ధన్యవాదాలు ఎందుకు చెప్పాలని కర్నూలు నగరానికి చెందిన ఓవైపీపీ కార్పొరేటర్‌ గట్టిగా ప్రశించటంతో సభలో కొంత గందరగోళానికి దారితీస్తుండటాన్ని మీడియా ప్రతినిధులు కవర్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు అధికారపార్టీ వైసీపీ కార్పొరేటర్లు అడ్డు తగిలారు.అజెండ అంశంపై రభస :కర్నూలు నగరపాలకసంస్ట సర్వసభ్య సమావేశము మేయర్‌ బి.వై.రామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ప్రారంభం కాగానే కొందరు కార్పొరేటర్లు మెదట ప్రజలు ఎద్కోంటు-న్న అంశాలపై చర్చించాలని పట్టు-పట్టారు.

మేయర్‌ మెదట అజెండా అంశాలపై చర్చిద్దామని కార్పొరేటర్లుకు సూచించారు. ఇంతలోనే కొందరు కార్పొరేటర్లు తమ డివిజన్‌ పరిధిలో ఎలాంటి అభివద్ది పనులు చేపట్టడం లేదని, కార్పొరేషన్‌ కు అత్యధికంగా కర్నూలు నుంచే అదాయం వస్తోన్న పాతబస్తీకి చెందిన ప్రాంతములో ఎందుకు అభివద్ది పనులు చేపట్టడం లేదని 11 డివిజన్‌ వైసీపీ కార్పొరేటర్‌ ఫరాజ్‌ ఖాన్‌ మేయర్‌ ను నిలదీశారు. అన్ని డివిజన్‌ లల్లో అభివద్ది పనులు జరిగాయని, డివిజన్ల వారీగా వివరిస్తానని అనటంతో మరికొంతమంది అధికార వైసీపీ కార్పొరేటర్లు తమ డివిజన్‌ లో అభివద్ది జరిగిందని చెప్పుకొనేందుకు ప్రయత్నించారు. కేవలం ఒక ప్రాంతము మాత్రమే అభివద్ది చెందుతుంది తప్పా పాతబస్తీలో ఎలాంటి అభివద్ది పనులు చేపట్టడంలేదని మరోసారి ఫరాజ్‌ ఖాన్‌ మేయర్‌ ప్రశ్నించారు.. అధికారపార్టీకి చెందిన కార్పొరేటర్లు ఫరాజ్‌ ఖాన్‌ వ్యాఖ్యలకు అడ్డుతగిలారు. ఇంతలోనే అభివద్దిపై ధన్యవాదాలు తెలుపుదామని చేసిన ప్రతిపాదనపై ఫరాజ్‌ ఖాన్‌ మరింత రెచ్చింపోయారు. అభివద్ది జరిగిన ప్రాంత కార్పొరేటర్లు ధన్యవాదాలు చెపుకొంటే అభ్యతరం లేదని, అభివద్దికి నొచుకొని తమ ప్రాంతాల తరుపున ధన్యవాదాలు ఎలా తెలుపుతామని ఫరాజ్‌ ఖాన్‌ గట్టిగా నిలదీశారు. ఇదే అంశముపై అధికారపార్టీ వైసీపీ కి చెందిన రెండు వర్గాల కార్పొరేటర్లుపై త్రీవస్టాయిలో వాగ్వాదం చొటు-చేసుకొంటు-డగా మీడియా ప్రతినిధులు చిత్రీకరిస్తుండటాన్ని కొందరు అధికారపార్టీ కార్పొరేటర్లు అడ్డుతగిలారు. ఈ వివాదాం మరింత వివాదాస్పదం కాకుండా కర్నూలు, పాణ్యము ఎమ్మేల్లే జొక్యొ చేసుకొని సర్దిచెప్పటంతో వివాదాం సద్గుమంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement