కర్నూలు బ్యూరో – మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో దోషికి కర్నూలు జిల్లా స్పెషల్ ఫోక్సో కోర్టు తీర్పు 20 ఏళ్లు జైలు శిక్ష , రూ.10 వేలు జరిమానా విధించింది.. కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలం , గంజ హల్లి గ్రామంకు చెందిన జెసిబి కి డ్రైవర్ గా దర్గా షేక్షావలి పని చేస్తున్నాడు . అతడు కర్నూలు , మహావీర్ నగర్ లో ఉంటున్న మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడు. మైనర్ బాలిక తల్లి జి. శాంత 2021సంవత్సరం, ఆగస్ట్ 12వ తేదిన కర్నూలు మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోక్సో యాక్ట్ కింద నిందుతుడిపై అప్పటి మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వెంకటరామయ్య దర్యాప్తు చేపట్టి సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించారు.
అన్ని కోణాల్లో విచారించిన కర్నూలు జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి భూపాల్ రెడ్డి నిందితుడిని దోషిగా తేల్చి కి 20 సంవత్సరాల జైలు శిక్ష , రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితు రాలికి ప్రభుత్వం తరపున రూ. 2 లక్షల నష్ట పరిహారం ఇవ్వవలసిందిగా ఆదేశించారు..
ముద్దాయికి శిక్ష పడటంలో కృషి చేసిన స్పెషల్ పి.పిలు వెంకటేశ్వరెడ్డి , ప్రకాష్ రెడ్డి, దర్యాప్తు అధికారి మహిళా పియస్ డిఎస్పీ వెంకటరామయ్య , మహిళా పియస్ కోర్టు కానిస్టేబుల్స్ మధుశంకర్, గోపి లను కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు. మహిళలు, చిన్న పిల్లల పట్ల లైంగిక వేధింపులు, అఘాయిత్యాలకు పాల్పడే వారికి కోర్టు తీర్పు ఒక గుణపాఠం కావాలని పేర్కోన్నారు.