కుప్పం.. ప్రభ న్యూస్ : కరుడుగట్టిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠాని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 300 గ్రాముల బంగారు ఆభరణలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకొనట్లు పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి, కుప్పం అర్బన్ సిఐ శ్రీధర్ తెలిపారు. కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..కుప్పం ..పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరు ఆదివారం నాడు మల్లానూరు క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంలో పట్టుబడ్డారని ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 300 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరచనున్నట్లు ఆయన తెలిపారు.ముగ్గురి నిందితుల పై ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి ఉన్నాయని వారు తెలిపారు.పళని,రాజ అనే ఇద్దరు తమిళనాడు రాష్ట్రానికి, మురుగన్ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా డిఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement