Monday, October 21, 2024

Kuppam – ఏనుగు దాడిలో రైతు మృతి

కుప్పం, జూన్ 16(ప్రభ న్యూస్ ): కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండల పరిధిలో పీఎంకే తాండ వద్ద ఆదివారం వేకువజామున ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది.మండల పరిధిలోని పీఎంకే తాండ వద్ద రైతు కన్నా నాయక్ (50) పై ఒంటరి ఏనుగు దాడి చేసి తొక్కిచంపేసింది. దిగువ తాండ నుంచి పీఎంకే తండాకు వెళ్తున్న రైతు కన్నా నాయక్పై దాడి చేయడంతోఅతను అక్కడికక్కడే మృతి చెందాడు.

ఏనుగుల దాడుల నియంత్రణలో ఫారెస్ట్ అధికారులకు పూర్తిగా విఫలమయ్యారంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు.ఏనుగుల రాకపోకలు గురించి కనీస సమాచారం అటవీ శాఖ అధికారులు వద్ద లేదు.కుప్పం నియోజకవర్గం లో అత్యధిక విస్తరణము అటవీ భూభాగం ఉన్నది.

ఇక్కడ గత శతబ్దాల కాలం గా ఈ అటవీ ప్రాంతంలో ఏనుగులు నివసిస్తున్నాయి. గతంలో ఏనుగుల సంచారంపై ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం ను వన సంరక్షణ సమితి సభ్యులు ద్వారా అటవీ శాఖ అధికారులు సేకరించి అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేవారు. తద్వారా ఏనుగులు గ్రామాల వైపు వస్తున్నాయంటే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొనేవారు. ఇందుకు పూర్తిగా తిలోదాకలు ఇచ్చి ప్రమాదం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరిగిన తరువాత అటవీ శాఖ అధికారులు స్పందిస్తు తమ నిర్లక్ష్యం చూపిస్తున్నారు.

కుప్పం అటవీ శాఖ అధికారులు ఏనుగుల ట్రాకింగ్ వ్యవస్థ ను పూర్తిగా పట్టించుకోకపోవడం తో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోగొట్టుకున్న విషయం ను ప్రభుత్వం గుర్తించాలి. అదేవిధంగా రైతులు రాత్రి పగలు కస్టపడి పండించుకొన్న పంటలను కేవలం కొన్ని నిముషాలల్లో ఏనుగులు ధ్వంసం చేస్తూన్నాయి. ప్రభుత్వం వెంటనే ప్రాణ నష్టం, పంట నష్టం ను నివారించేందుకు తక్షణమే ఏనుగుల ట్రాకింగ్ వ్యవస్థ ను పునః ప్రారంభం చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement