రాజమండ్రి – టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు నాయుడుని తప్పుడు కేసులో అరెస్టు చేశారన్నారు. న్యాయం జరుగుతుందని లోకేష్ కి ధైర్యం చెప్పారు.
అలాగే ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు.. ఈ మేరకు ఆయన టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడితో నేడు ఫోన్ లో మాట్లాడారు.. జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు… తాను చంద్రబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడతానని యనమలకు చెప్పారు.