మన్యం జిల్లా పార్వతీపురం ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో (ఏవోబీ) మావోస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు కూబింగ్ నిర్వహించాయి. పార్వతీపురం పరిధిలోని సుంకీ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని బెటాలియన్ కమాండ్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ సందీప్ కెర్‌కెట్టా తెలిపారు.
మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రం మన్యం జిల్లా పాచిపెంట మండలం కుంతాం బడేవలస, పద్మాపురం గ్రామాలకు మూడు, 4 కి.మీటర్ల దూరంలో ఉంది. కూంబింగ్‌లో భాగంగా భద్రతా దళాలు హేండ్ బౌలర్, టిగ్గర్ మెకానిజం, ఫిల్లర్లు, హేమర్, స్లీపర్, చేజల్, ఫైల్, కత్తులు, ఇనుప బిట్లను సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.