ఆంధప్రభ స్మార్ట్ – నాగార్జునసాగర్: ఎగువ నుంచి భారీగా వరద చేరుకుంటుండటంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. దీంతో నాగార్జునసాగర్ జలాశయం 10గేట్లను అధికారులు ఎత్తారు. ఈ ఉదయమే అధికారులు ఆరు గేట్లు ఎత్తగా..మధ్యాహ్నం మరో నాలుగు గేట్లను ఎత్తారు. అంతకు ముందు ఉదయం కృష్ణమ్మకు ఎస్ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్‌కుమార్ జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడుసార్లు సైరన్ మోగించారు.
ప్రస్తుతం సాగర్ క్రస్టు గేట్ల ద్వారా దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలనున్నట్లు అధికారులు తెలిపారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 582.6గా ఉంది. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 290.51 టీఎంసీలుగా ఉంది. సాగర్ ఇన్‌ఫ్లో 3,23,748 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 83,331 క్యూసెక్కులుగా ఉంది.
Krsihna River – సాగర్ లో మరో నాలుగు గేట్లు ఎత్తివేత ..
- Advertisement -
Advertisement
తాజా వార్తలు
Advertisement