షుగర్ వ్యాధిపై యుద్ధం అనే గ్రంధం మధుమేహం పై అనుమానాలు, అపోహలు ఉన్నవారికి మంచి సంజీవనిలా పనిచేస్తుందని మాజీ ఉపసభాపతి డా. మండలి బుద్ధప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం అవనిగడ్డ గాంంధీ క్షేత్రంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన షుగర్ వ్యాధిపై యుద్ధం ప్రకటిద్దాం రండి పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత డాక్టర్ ప్రతాప్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు..ఈ సందర్భంంగా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్న మన దేశం ప్రపంచ డయాబెటిస్ రాజధానిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రజల్లో ఈ వ్యాధిపై అనేక అనుమానాలు ఉన్నాయని వాటికి సమాధానమే ఈ పుస్తకమన్నారు.. ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త ఫెడ్రిక్ బాంటింగ్ ఇన్సులిన్ కనిపెట్టిన సందర్భంగా ఆయన జయంతిని ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, అలాంటి రోజున షుగర్ వ్యాధి గ్రస్తులకు ఉపకరించేలా పుస్తకం రావటం దానిని దివిసీమ వాసి రచించటం గర్వకారణమన్నారు.. రచయిత డాక్టర్ చేబ్రోలు ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ తన 20 సంవత్సరాల వైద్య అనుభవంలో రోగుల నుంచి వచ్చిన అనేక ప్రశ్నలకు సమాధానం వచ్చేలా పుస్తక రచన చేశానని తెలిపారు.. ఈ కార్యక్రమంలో అమ్మతనం ఒక వరం పుస్తక రచయిత్రి సత్య కామేశ్వరి,గాంధీక్షేత్రం కమిటీ ముఖ్యులు మత్తి శ్రీనివాసరావు, గాజుల మురళి, భోగాది రమణ, తెలుగుదేశం నేతలు యాసం చిట్టిబాబు, కొల్లూరి వెంకటేశ్వరరావు, ఘంటసాల రాజమోహనారావు, యాసం శ్రీరాములు, బొప్పన కాశీవిసవేశ్వరరావు, గుడివాక మల్లిఖార్జునరావు, పరిమిశెట్టి శేఖర్, మెగావత్ గోపి, బర్మా శ్రీను తదితరులు పాల్గొన్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement